తమిళనాడులోని కడయనల్లూరు దగ్గర, తెన్కాసి-మధురై రహదారిపై సోమవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను తెన్కాసిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అత్యంత వేగంగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
రెండు ప్రైవేటు బస్సులు ఢీ : ఆరుగురు మృతి, 35 మందికి గాయాలు
الاثنين، 24 نوفمبر 2025
35 injured Among the dead were children and women Six dead tamilnadu Tenkasi-Madurai highway near Kadayanallur Two private buses collide
ليست هناك تعليقات:
إرسال تعليق