ఆయుధాలు వీడేందుకు సిద్ధం: వచ్చే ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని మావోయిస్టుల లేఖ

الاثنين، 24 نوفمبر 2025

letters have been sent to the Chief Ministers of Maharashtra Madhya Pradesh and Chhattisgarh Maoists' letter to give time till February 15 national Ready to lay down arms

t f B! P L


యుధాలు వీడే విషయమై మావోయిస్టులు తాజాగా లేఖ విడుదలు చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపించారు. మావోయిస్టు ప్రతినిధి పేరుతో సీఎంలకు లేఖ అందింది. ఈ లేఖలో మావోయిస్టులు తాము ఆయుధాలు వీడి, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న 'పోరాటం నిలిపివేయాలన్న' నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మావోయిస్టు ప్రతినిధులు ఆయుధాలు విడిచిపెట్టి, ప్రభుత్వ పునరావాస పథకాలను పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ లేఖలో మావోయిస్టులు ఎంఎంసీ జోన్‌లోని మావోయిస్టులందరూ సామూహికంగా లొంగిపోతారు. ఎప్పటి నుంచి ఆపరేషన్‌ కూంబింగ్‌ను నిలిపివేస్తారో అప్పుడే మేము ఆయుధాలను వీడటం జరుగుతుంది. ఆ వెంటనే ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. అలాగే, మావోయిస్టులు తమ ఈ కీలక నిర్ణయంపై సమష్టి నిర్ణయానికి రావడానికి కొంత సమయాన్ని కోరారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయడానికి తమకు వచ్చే ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని వారు ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తి వెనుక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదని, కేవలం అంతర్గతంగా చర్చించుకోవడానికి, తుది నిర్ణయాన్ని నిర్ధారించుకోవడానికి మాత్రమే ఈ సమయం అవసరమని వారు లేఖలో స్పష్టం చేశారు. అయితే, ఆపరేషన్‌ కగార్‌ కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల అభ్యర్థనను ప్రభుత్వాలు ఏ విధంగా స్వీకరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల ప్రతిపాదనను స్వాగతిస్తూ ఎలాంటి చర్యలు లేదా హామీలు ఇస్తాయనే చర్చ మొదలైంది. మావోయిస్టులు అడిగిన సమయం లోపల, ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు, భద్రతా బలగాలు కూడా తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి మావోయిస్టుల ఆయుధ విరమణ లేఖ సంచలనంగా మారింది. ఈ లేఖ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక మలుపుగా పరిగణించవచ్చు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ