రష్యా నుంచి ఇంధనం కొనుగోలులో భారత్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ వెల్లడించింది. ఒక్క అక్టోబర్ నెలలోనే దాదాపు 2.5 బిలియన్ యూరోల విలువ కలిగిన చమురును రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసినట్లు స్పష్టం చేసింది. రష్యా నుంచి 2.5 బిలియన్ యూరోల విలువ కలిగిన చమురును అక్టోబర్ నెలలో భారత్ కొనుగోలు చేసినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ తాజాగా వెల్లడించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు విషయంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక మొదటి స్థానంలో చైనా ఉన్నట్లు తెలిపింది. అయితే అక్టోబర్ 22న రష్యాలోని చమురు సంస్థలైన రోస్ నెఫ్ట్, లూక్ ఆయిల్ పై అమెరికా ఆంక్షలు విధించింది. చమురు వాణిజ్యంపై వచ్చిన లాభాలను రష్యా.. ఉక్రెయిన్ పై యుద్ధానికి ఖర్చు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో చాలాసార్లు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 22న ఈ ఆయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే అమెరికా ఆంక్షలతో భారత్ లోని ఆయిల్ రిఫైనరీ సంస్థలైన రిలయన్స్, హెపీసీఎల్- మిట్టల్, మంగళురు రిఫైనరీ, పెట్రో కెమికల్స్ లిమిటెడ్.. తమ కొనుగోళ్లను నిలిపివేశాయి. మరోవైపు రష్యా.. అక్టోబర్ లో భారత్ కు 60 మిలియన్ బారెల్స్ క్రూడ్ ఆయిల్ ను ఎగుమతి చేసింది. కేవలం రోస్ నెఫ్ట్, లూక్ ఆయిల్ సంస్థల నుంచే దాదాపు 45 మిలియన్ బారెల్స్ ముడి చమురు ఎగుమతి అయినట్లు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ తెలిపింది. గతంలో మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధార పడిన భారత్, 2022 ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభం నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఇదే క్రమంలో రష్యా ముడి చమురుపై డిస్కౌంట్లు పెట్టడంతో భారత్ లాంటి అనేక దేశాలు రష్యాతో వాణిజ్యం పెంచుకున్నాయి. దాంతో రష్యా నుంచి భారత్.. ముడి చమురు కొనుగోలు 1 శాతం నుంచి కొద్దికాలంలోనే దాదాపు 40 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ లో 3.6 బిలియన్ యూరోల చమురును భారత్ దిగుమతి చేసుకుంది.
అక్టోబర్ నెలలో 2.5 బిలియన్ యూరోల చమురును రష్యా నుంచి కొనుగోలు చేసిన భారత్ !
الأحد، 16 نوفمبر 2025
business Center for Research on Energy and Clean Air China is the first India buys 2.5 billion euros worth of oil from Russia in October India is the second international national
ليست هناك تعليقات:
إرسال تعليق