అక్టోబర్ లో 1.53 లక్షల ఐటీ ఉద్యోగాల హాంఫట్ :అమెరికా ఆర్థిక అనిశ్చితిని పెంచి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం

الجمعة، 7 نوفمبر 2025

1.53 lakh IT jobs lost in October science technology US risks increasing economic uncertainty and having a serious impact on global markets

t f B! P L


మెరికాలో ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టెక్నాలజీ రంగంలో గత రెండేళ్లుగా విపరీతంగా పెరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత షేర్ల విలువలు ఇప్పుడు దారుణంగా పతనమవుతున్నాయి. మార్కెట్ వర్గాలు దీన్ని ఏఐ బుడగ పగలడంగా భావిస్తున్నాయి. ఈ పరిణామాలు రికార్డు స్థాయి ఉద్యోగాల తొలగింపుతో కలిసి అమెరికా ఆర్థిక అనిశ్చితిని పెంచి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ స్టాక్ మార్కెట్‌ నాస్‌డాక్ ఇండెక్స్‌లో నవంబర్ 6న జరిగిన భారీ పతనం ఏఐ కంపెనీల భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలను బలపరుస్తోంది. గత 24 నెలల్లో చాలా ఏఐ సంబంధిత టెక్ కంపెనీల షేర్ల ధరలు వాటి వాస్తవ వృద్ధి కంటే చాలా వేగంగా పెరిగాయి. దీనినే అతి-విలువగా పేర్కొంటున్నారు. కొన్ని ప్రముఖ ఏఐ కంపెనీలు అంచనాలకు తగ్గట్టుగా మంచి త్రైమాసిక ఫలితాలను ప్రకటించినప్పటికీ షేర్లు పడిపోతున్నాయి. ఎందుకంటే అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు భవిష్యత్తులో ఈ కంపెనీలు ఆ విలువలకు తగిన రిటర్న్స్ ఇవ్వగలవనే నమ్మకం సన్నగిల్లింది. అంచనాలు, వాస్తవాల మధ్య పెరుగుతున్న అంతరం కారణంగానే పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. టెక్నాలజీ రంగం నుంచి రిటైల్, లాజిస్టిక్స్ వరకు అన్ని రంగాలలో భారీగా ఉద్యోగాలు తొలగించబడుతున్నాయి. ఈ తొలగింపులు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉందని సూచిస్తున్నాయి. అక్టోబర్ 2025లో సుమారు 1.53 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం అనేది గత 20 ఏళ్లలో అక్టోబర్ నెలలో జరిగిన అత్యధిక ఉద్యోగాల కోత. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 11 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఒకవైపు ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న వ్యయాల కారణంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఏఐ, ఆటోమేషన్ టెక్నాలజీ ప్రవేశంతో మానవ వనరుల అవసరం తగ్గిపోతోంది. ఈ ప్రభావాల కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మార్కెట్ల పతనానికి కేవలం ఏఐ షేర్ల భయాలు మాత్రమే కాక స్థూల ఆర్థిక అంశాలు కూడా కారణమవుతున్నాయి. అమెరికాపై ఉన్న అప్పు 38 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరుకుంది. ఇది జీడీపీలో 324 శాతానికి సమానం. ఈ అప్పును నియంత్రించడంలో విఫలమైతే, భవిష్యత్తులో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండటం, కంపెనీల రుణభారాన్ని పెంచి, వృద్ధిని అడ్డుకుంటుంది. ఆర్థిక సవాళ్లకు తోడు, అమెరికన్ రాజకీయాల్లో పెరుగుతున్న అనిశ్చిత వాతావరణం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ