తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలోని బాలికల వాష్ రూమ్ లో రహస్య కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపింది. అమ్మాయిల బాత్రూమ్లో అటెండర్ యాకూబ్ సీక్రెట్ కెమెరాను పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నాడు. బాత్రూమ్లో ఓ పరికరం మెరుస్తూ ఓ పరికరం బాలికల కంటపడింది. ఏంటా అని చెక చేయగా.. రహస్య కెమెరా అని గుర్తించారు. వెంటనే హెడ్మాస్టర్కి, తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు. బాత్రూమ్ నుంచి కెమెరా తరహా పరికరం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆగ్రహంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ పాఠశాలకు చెందిన అటెండర్ యాకూబ్ అని తేలింది. ఇతను సీక్రెట్ కెమెరాను అమర్చి వీడియోలు రికార్డు చేస్తూ వికృత ఆనందం పొందుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా అటెండర్ యాకూబ్ బాలికల ఫొటోలు తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. బాలికలు, వారి తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని హెడ్మాస్టర్కు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వాష్రూమ్ నుంచి కెమెరా తరహా పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరంలో ఉన్న రికార్డుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడైన అటెండర్ యాకూబ్ ఈ విషయం బయటపడటంతోనే పరారీలో ఉన్నాడు.
ప్రభుత్వ పాఠశాల టాయిలెట్లో రహస్య కెమెరా అమర్చిన అటెండర్
الثلاثاء، 28 أكتوبر 2025
Attendant installs secret camera in government school toilet Kurikyala Government School in Karimnagar district telangana
ليست هناك تعليقات:
إرسال تعليق