ఫీజు రియంబర్స్‌మెంట్ చేయకుంటే నవంబర్‌ 3 నుంచి ప్రైవేటు కాలేజీల బంద్‌


తెలంగాణాలో కాంగ్రెస్‌ సర్కారుకు ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి హెచ్చరిక చేశాయి. ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలను బంద్ చేయిస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య స్పష్టం చేసింది. రూ.900 కోట్ల బకాయిలు ఇవ్వకుంటే మళ్లీ బంద్‌ తప్పని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ చైర్మన్‌ ఎన్ రమేశ్‌ హెచ్చరించారు. రూ.1200 కోట్లకు రూ.300 కోట్లే ఇచ్చారని రమేశ్‌ ఆరోపించారు. నవంబర్‌ ఒకటో తేదీలోగా మిగిలిన రూ.900 కోట్లు ఇవ్వాల్సిందేనన్నారు. మిగతా బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకుంటే కాలేజీలు నడుపలేమని, మంత్రులు తమకు సహకరించడం లేదని ఆరోపించారు. బకాయిలు అడిగితే మాపై విచారణలు చేస్తున్నారని విమర్శించారు. భయపెడితే ఊరుకోమని, ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి రానివ్వమని స్పష్టం చేశారు. 

Post a Comment

0 Comments