ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున రష్యా డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు.29 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరణించిన వారిలో 19 ఏళ్ల మహిళ, ఆమె 46 ఏళ్ల తల్లి ఉన్నారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. రష్యా డ్రోన్ల దాడి కారణంగా రాజధానిలోని దెస్నియాన్స్కీ జిల్లాలోని రెండు నివాస భవనాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. అత్యవసర సిబ్బంది 16 అంతస్తుల భవనాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించి మంటలను ఆర్పారు. ఆదివారం తెల్లవారుజామున రష్యా మొత్తం 101 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 90 డ్రోన్లను కూల్చివేశారు. ఇక ఐదు డ్రోన్లు నాలుగు వేర్వేరు ప్రాంతాలను తాకగా, డ్రోన్ల శిథిలాలు మరో ఐదు ప్రాంతాలలో పడినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రష్యా క్షిపణి, డ్రోన్ల దాడిలో ఒక రోజు ముందు కీవ్‌లో మొత్తం నలుగురు మరణించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పశ్చిమ దేశాల వైమానిక రక్షణ వ్యవస్థల కోసం మరోసారి విజ్ఞప్తి చేశారు.
కీవ్‌పై రష్యా డ్రోన్ల దాడిలో ముగ్గురు మృతి, 29 మందికి గాయాలు
الأحد، 26 أكتوبر 2025
29 injured in Russian drone attack on Kiev international Russian drone attack caused fires in two residential buildings in the capital's Desniansky district Three killed Ukrainian
ليست هناك تعليقات:
إرسال تعليق