14,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్

الأربعاء، 29 أكتوبر 2025

000 employees 000 employees in India Amazon to lay off 14 It is reported that 800 to 1 Job cuts in the company have increased significantly after Amazon CEO Andy Jassy took over technology

t f B! P L


మెజాన్ మరోసారి పెద్ద స్థాయిలో లేఆఫ్స్‌ చేపట్టింది. ఈసారి కంపెనీ దాదాపు 14,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనుంది. ఇందులో భారత్‌లో 800 నుండి 1,000 మంది వరకు ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఫైనాన్స్, మార్కెటింగ్, మానవ వనరులు, టెక్నాలజీ వంటి విభాగాల్లో ఈ తొలగింపులు జరిగే అవకాశముందని అంచనా. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీలో ఉద్యోగాల కోతలు గణనీయంగా పెరిగాయి. జనరేటివ్ ఏఐ అభివృద్ధితో రాబోయే కాలంలో మానవ వనరుల అవసరం తగ్గవచ్చని ఆయన ముందే పేర్కొన్నారు. 2023లో అమెజాన్ రెండు విడతల్లో సుమారు 27,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది, అందులో భారత్‌లో 500 మంది ఉన్నారు. తాజా లేఆఫ్‌లో కూడా భారతీయ కార్పొరేట్ సిబ్బంది ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వారికి సంస్థలోనే మరో అవకాశాన్ని వెతికేందుకు మూడు నెలల సమయం ఇస్తారు. కొత్త ఉద్యోగం దొరకకపోతే సెవరెన్స్ పే, అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలు, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు అందజేస్తారు. ప్రస్తుతం అమెజాన్ ఏఐ టెక్నాలజీల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టుతోంది. వ్యయాలను తగ్గించి లాభదాయకతను పెంచడం లక్ష్యంగా ఈ ఉద్యోగ కోతలు చేపడుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ