ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై కేవీ 11 వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు చుట్టుప్రక్కల వ్యాపించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 4 బస్సులు దగ్దమయ్యాయి. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున జరిగింది. బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సులు దగ్ధం
الخميس، 2 يناير 2025
Andhra Pradesh అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సులు దగ్ధం కేవీ 11 వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు ప్రమాదంలో 4 బస్సులు దగ్ధం
ليست هناك تعليقات:
إرسال تعليق