ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వచ్చిన కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ కారులో గంజాయిని తరలిస్తుండటంతో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీలుగా వారిపైనే పోనిచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ క్రమంలో అర్థరాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కన ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి ముందుకు పోనిచ్చాడు. దీంతో వాహనం ముందు నిల్చున్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతోపాటు మరో కానిస్టేబుల్‌పై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిన కారు డ్రైవర్ రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వాహనాన్ని వదిలి పరారయ్యాడు. డ్రైవర్‌తోపాటు ఇతర నిందితులు పశ్చిమ గోదావరిలో పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. కాగా, నిందితులు వదిలి వెళ్లిన కారు ఉత్తరప్రదేశ్‌లో రిజిస్టర్ అయింది. అందులో గంజాయి రవాణా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులపైకి కారు ఎక్కించిన గంజాయి ముఠా !
الخميس، 2 يناير 2025
Andhra Pradesh Criem కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద పోలీసులపైకి కారు ఎక్కించిన గంజాయి ముఠా రోడ్డు పక్కన ఆపుతున్నట్టు నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగం పెంచి ముందుకు పోనిచ్చాడు
ليست هناك تعليقات:
إرسال تعليق