గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ 25వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రిఫైనరీని ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేంద్రంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. "రిలయన్స్ కుటుంబ రత్నం"గా గుర్తింపు పొందిన జామ్ నగర్‌ను ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు గల ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేంద్రంగా తయారుచేస్తామని ఆయన వెల్లడించారు. జామ్ నగర్ రిఫైనరీ 25వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకలో ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తి చేస్తామని.. అందుకు చాలా గర్విస్తున్నామని తెలిపారు. ఈ కార్యరంగంలో ఆయనతో పాటు సోదరి ఈషా అంబానీ, సోదరుడు అనంత్ అంబానీ కూడా పాల్గొన్నారు. రిలయన్స్ వృద్ధి కోసం సమిష్టి దృష్టితో పని చేస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. జామ్ నగర్‌ తమకి ఎప్పుడు ప్రత్యేకమని, అందుకే ప్రపంచంలోని అతిపెద్ద ఏఐ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నాట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం భవన నిర్మాణం ప్రారంభమైంది. 24 నెలల్లో పూర్తి చేసి, జామ్ నగర్‌ను ఐటీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దతామని ఆకాశ్ అంబానీ స్పష్టం చేశారు. 1999 డిసెంబర్ 28న రిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ స్థాపన చేయబడింది. ప్రారంభంలో అంతర్జాతీయ నిపుణులు భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీ ఆ అనుమానాలను త్రో చేసి కేవలం 33 నెలల్లోనే ఈ రిఫైనరీని పూర్తి చేశారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ