బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం థాటికి ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్ రోడ్డులోని హరిణికి సమీపంలో జారిపడిన బండరాళ్లను సిబ్బంది తొలగించారు. ఘాట్‌రోడ్డులో జాగ్రత్తగా వాహనాలు నడపాలని తితిదే అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తితిదే ముందస్తు చర్యలు చేపట్టింది. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో భక్తుల వాహనాల రాకపోకలను నిలిపివేసింది. రెండు ఘాట్‌రోడ్లలో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేసింది. వర్షం కారణంగా శ్రీవారి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వర్షానికి కొండపై చలి తీవ్రత పెరిగింది. దర్శనానంతరం లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్ళే భక్తులు తితిదే ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. సీఆర్వో వద్ద గదులు పొందే భక్తులు వర్షానికి అవస్థలు పడుతున్నారు. పాపవినాశనం జలశయాం నీటి సామర్ధ్యం పూర్తి స్ధాయిలో నిండడంతో గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో జారిపడిన బండరాళ్లు !
الخميس، 12 ديسمبر 2024
Andhra Pradesh ఘాట్‌రోడ్డులో జాగ్రత్తగా వాహనాలు నడపాలని తితిదే అధికారులు తిరుమల ఘాట్ రోడ్డులో జారిపడిన బండరాళ్లు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
ليست هناك تعليقات:
إرسال تعليق