రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌చరణ్ (గేమ్ ఛేంజర్ లుక్) కటౌట్ ఏర్పాటు చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని, ఇది తమకెంతో ప్రత్యేకమని అభిమానులు చెబుతున్నారు. రామ్‌చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు వారం రోజులు శ్రమించి దీనిని సిద్ధం చేశామని.. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ నిర్మాణంలో భాగమైందని అభిమానులు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఆ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చిత్రబృందానికి సంబంధించిన పలువురు సభ్యులు ఇందులో పాల్గొననున్నారు.
విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ !
الأحد، 29 ديسمبر 2024
Andhra Pradesh cinema telangana దాదాపు వారం రోజులు శ్రమించి దీనిని సిద్ధం చేశారు విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్
ليست هناك تعليقات:
إرسال تعليق