ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది !


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లానందికొట్కూరు బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని లహరిని ప్రేమిస్తున్నానని ఓ యువకుడు వెంటపడేవాడు. అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో విద్యార్థిని పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొనికేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments