వాటర్‌ హీటర్‌కు నవ వధువు బలి !


తెలంగాణ;లోని మంచిర్యాల జిల్లా నెన్నెలలో మారమ్మవాడకు చెందిన స్వప్న (22), అదే గ్రామానికి చెందిన పల్ల సిద్ధు రెండేండ్లుగా ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకుందామని తల్లిదండ్రులను ఆశ్రయించగా వారు నిరాకరించారు. ఏం చేయాలో తోచక ఇరువురు గ్రామ పెద్దలను కలిశారు. వారి సమక్షంలో ఈ నెల 4న బెల్లంపల్లిలోని శివాలయంలో పెండ్లి చేసుకున్నారు. ఆదివారం ఉ దయం స్వప్న స్నానం చేసేందుకు వాటర్‌ హీటర్‌ను బకెట్లో ఉంచింది. అదే సమయంలో కరెంట్‌ కోత విధించారు. కరెంట్‌ లేదన్న ఉద్దేశ్యంతో నీటిలో నుంచి హీటర్‌ను తీస్తుండగా షాక్‌తో కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ విషాద ఘటన చూసిన స్థానికులు కన్నీరు పెట్టారు. స్వప్న తల్లిదండ్రుల వేదన అక్కడున్న వారిని కలిచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

Post a Comment

0 Comments