తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో అప్లైడ్ సైంటిస్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2019లో ఐఐటీ పట్నా నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన మూడో సంవత్సరంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మెషిన్ లెర్నింగ్ కోవిదుడు గేల్ డయాస్ వద్ద 3 నెలలు ఇంటర్న్‌షిప్ చేశారు. అనంతరం బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లో రెండేళ్లు పనిచేశారు. 2023లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ఎంఎస్ పట్టా పొందారు. యువకుడి తండ్రి యాసిన్ ఖురేషీ ప్రస్తుతం ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు.
0 Comments