నిజామాబాద్ మిర్చి కంపౌండ్ లో వ్యక్తి దారుణ హత్య !


తెలంగాణలోని నిజామాబాద్ మిర్చి కంపౌండ్ లో ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన యూసుఫ్ (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు యూసుఫ్ తో పాటు మరో ఇద్దరు ఓ ట్రాన్స్ పోర్టు కార్యాలయం ఎదుట ఆదివారం రాత్రి స్థానికులు, పోలీసులు తెలుపుతున్నారు. ఆ ముగ్గురిలో యూసుఫ్ దారుణ హత్యకు గురి కాగా, మిగతా ఇద్దరు వ్యక్తులు ఉదయం నుంచి అక్కడ కనిపించలేదు. యూసుఫ్ తో పాటు అక్కడ పడుకున్న ఇద్దరు వ్యక్తులే యూసుఫ్ గొంతుకోసి హత్య చేసారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాన్స్ పోర్టు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంబంధిత వన్ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి, ఎస్సై మొగులయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి అక్కడున్న వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. యూసుఫ్ తోపాటు నిద్రించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments