Ad Code

దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారోత్సవంలో దొంగల చేతివాటం !

క్షిణ ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులతో కలిపి దాదాపు 5 వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే కొందరు కేటుగాళ్లు దొంగతనానికి పాల్పడ్డారు. 13 బంగారు గొలుసులను కాజేసినట్టు సమాచారం. మరికొందరి నుంచి రూ. 12 లక్షలకు పైగా విలువైన వస్తువులను చోరీ చేశారు. మరో మహిళ 20 గ్రాముల నగ పోయిందని తెలిపారు. ఇలా 13 మంది ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇటీవల వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 230 స్థానాలతో అఖండ విజయం సాధించింది. భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌కు అధిష్ఠానం సీఎం బాధ్యతలు అప్పగించింది. ఇటీవల సీఎం ప్రమాణస్వీకరణ కార్యక్రమంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.


Post a Comment

0 Comments

Close Menu