వైకాపా భూబకాసురులు రాష్ట్రంలో వేల ఎకరాలు కబ్జా చేశారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ప్రభుత్వ భూముల నుంచి దేవాదాయ, అసైన్డ్ భూముల వరకు అన్నీ కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వచ్చిన వాటిలో 68 వేల ఫిర్యాదులు భూకబ్జాలపైనే ఉన్నాయన్నారు. బెదిరింపులతో కాకినాడ పోర్టు భూములను రూ.12 కోట్లకే కొట్టేశారన్నారు. ''వైకాపా హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాలన గాలికొదిలేసి భూముల కబ్జాపైనే దృష్టి పెట్టారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, విథున్‌రెడ్డి వెయ్యి ఎకరాలు కబ్జా చేశారు. మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులు తగలబెట్టారు. పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ వెయ్యి కోట్ల విలువైన భూములను కొట్టేశారు. అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి బ్రదర్స్ సోలార్ భూములను కూడా వదల్లేదు. మహిళా మంత్రులు రోజా, ఉష శ్రీచరణ్ కూడా భూకబ్జాలు చేశారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు'' అని హెచ్చరించారు.
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు !
الثلاثاء، 10 ديسمبر 2024
Andhra Pradesh చంద్రబాబుపై విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు వేల ఎకరాలు కబ్జా చేశారు శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
ليست هناك تعليقات:
إرسال تعليق