అపరిచిత నెంబర్ల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోవద్దని ఒకవేళ రిసీవ్ చేసుకుంటే సెకండ్లలోనే డేటాను చోరీ చేసి మిమ్మల్ని కటకటాల పాలు చేసే ప్లాన్ తో సైబర్ నేరగాళ్లు రెడీ అయ్యారని హెచ్చరిస్తున్నారు. +37052529259, +56322553736,+255901130460,+94777 455913,+37127913091 వంటి నెంబర్లతో ఫోన్ చేస్తే ఎత్తకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ నెంబర్లతో వచ్చిన ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేస్తే వారు మన ఫోన్లోని కాంటాక్ట్ జాబితాతో పాటు బ్యాంకు క్రెడిట్ కార్డులు ఇతర వివరాలను కేవలం మూడు సెకండ్లలోనే కాపీ చేసుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తద్వారా మీ సిమ్ కార్డును వారు యాక్సెస్ చేసి దానితో నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. మిమ్మల్ని నేరస్తులుగా చేసి తమ పని చేసుకుంటారని కనుక అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అందుకే ఈ నెంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్ పై తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి సైబర్ నేరాల కట్టడికి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఎంత కృషి చేస్తున్నా సరే ప్రజలలోనూ వీటిపై అవగాహన ఉండాలని, లేదంటే సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కి మోసపోయే ప్రమాదం ఉంటుంది.
అపరిచిత నెంబర్ల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోవద్దు !
الأربعاء، 4 ديسمبر 2024
science technology అపరిచిత నెంబర్ల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోవద్దు మీ సిమ్ కార్డును వారు యాక్సెస్ చేసి దానితో నేరాలకు పాల్పడే అవకాశం
ليست هناك تعليقات:
إرسال تعليق