ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని మాచవరం మండలంలో 17. 69 ఎకరాల అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వైఎస్ జగన్, ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ ఆస్తుల వివాదం కోర్టుకు చేరడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో ఇటీవల కాలంలో మాచవరానికి చెందిన `సరస్వతి పవర్ అసైన్డ్ భూములను పరిశీలించారు. ఈ సంస్థకు కేటాయించిన భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నాయా, లేదా అనేది తేల్చాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీంతో ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ రికార్డులను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మాచవరం మండలం ఎమ్మార్వో క్షమారాణి, సర్వేయర్ సాల్మన్ రాజు, ఆర్ఐ కోటేశ్వరరావు, వీఆర్వో అఖిల్, దాచేపల్లి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి కె. విజలక్ష్మి, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మనోజ్ సరస్వతి సిమెంట్స్, పవర్ భూములను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ మేరకు ఆ భూములను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
సరస్వతి పవర్ అసైన్డ్ భూములను వెనక్కి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం !
الخميس، 12 ديسمبر 2024
17. 69 ఎకరాలు Andhra Pradesh విజయమ్మ వైఎస్ జగన్ షర్మిల సరస్వతి పవర్ అసైన్డ్ భూములను వెనక్కి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ليست هناك تعليقات:
إرسال تعليق