దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. డిసెంబరు 15 నాటికి ఇది అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరంవైపు కదిలే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలియజేసింది. మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. చాలా చోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ హెచ్చరించింది.
కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు !
الجمعة، 13 ديسمبر 2024
Andhra Pradesh కోస్తా భారత వాతావరణ విభాగం రాయలసీమలో మోస్తరు వర్షాలు శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం
ليست هناك تعليقات:
إرسال تعليق