జూ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశంలో అటవీ శాఖ అధికారులను మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జూపార్కుల తోపాటు అర్బన్ ఫారెస్ట్ పార్కులను పర్యాటకులను ఆకర్షించే విధంగా మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. అటవీ అధికారులతో కలిసి యానిమల్ అడాప్షన్ స్కీమ్ బ్రోచర్, డైరీ, కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ జంతు ప్రదర్శనశాలల్లో సందర్శకుల అభిరుచుల మేరకు పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా అటవీ శాఖకు ఆదాయం సమకూరేలా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా జూపార్కుల్లో అవలంబిస్తున్న విధానాలపై అధ్యయనం చేసి ఉత్తమ పద్ధతులు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 9 జూ పార్కులతోపాటు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. నెహ్రూ జూ పార్కు, కాకతీయ జూ పార్కు, పిల్లలమర్రి మినీ జూపార్కు, లోయర్ మానేరు డీర్ పార్కు, కిన్నెరసాని డీర్ పార్కులో జంతు సంరక్షణ చర్యలు, కేబీఆర్, మృగవని, మహావీర్ హరిణవసన్థలి, ఇతర అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సందర్శకుల సంఖ్య పెరిగేలా చర్యలు, అదనపు సౌకర్యాలపై మంత్రి అధికారులకు సూచనలు చేశారు. వర్షాల కారణంగా కేబీఆర్ పార్కు చుట్టూ ప్రహారీ 300 మీటర్లు దెబ్బతిన్నట్లు మంత్రి దృష్టికి తీసుకురాగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నెహ్రూ జూ పార్కులో ఖాళీల భర్తీ చేయాలని అధికారులు ప్రస్తావించగా.. అందుకు మంత్రి ఆమోదం తెలిపారు.
జూ, అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో మెరుగైన సౌకర్యాలు తీర్చిదిద్దాలని ఆదేశించిన మంత్రి కొండా సురేఖ !
الجمعة، 13 ديسمبر 2024
telangana అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో మెరుగైన సౌకర్యాలు తీర్చిదిద్దాలని ఆదేశించిన మంత్రి కొండా సురేఖ జూ జూ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం
ليست هناك تعليقات:
إرسال تعليق