తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వియ్యంకుడు, ఎమ్మెల్సీ కవిత మామగారైన, బీఆర్ఎస్ సీనియర్ నేత రాంకిషన్ రావుపై నిజామాబాద్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నిజామాబాద్ లో ఓ స్థల వివాదం విషయంలో గాధారి గోపి ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాంకిషన్ రావుతోపాటు కొండూరు నగేష్, సూదం రవిలపై అట్రాసిటీ కేసు నమోదైంది. రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్కేఆర్ అపార్ట్మెంట్ వద్ద 235 గజాల స్థలం విషయమై కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు రాంకిషన్ రావు, అతని అనుచరులు ప్రయత్నిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని అపార్ట్మెంట్ కు చెందిన గోపి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు రూరల్ పోలీసు స్టేషన్ ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపారు. ఈ స్థలం తమదని, తాము ఎలాంటి కబ్జా చేయలేదని కొండూరు నగేష్ తెలిపారు. ఈ వివాదంతో ఎమ్మెల్సీ కవిత మామ రాంకిషన్ రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అపార్ట్మెంట్ వాసుల్లో కొందరు తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అదే పోలీసు స్టేషన్ లో నగేష్ ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ వియ్యంకుడు రాంకిషన్ రావుపై అట్రాసిటీ కేసు నమోదు !
السبت، 14 ديسمبر 2024
telangana ఎమ్మెల్సీ కవిత మామ కేసీఆర్ వియ్యంకుడు రాంకిషన్ రావుపై అట్రాసిటీ కేసు నమోదు నిజామాబాద్ లో ఓ స్థల వివాదం విషయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత
ليست هناك تعليقات:
إرسال تعليق