జొమాటో రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అనే ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్డర్ చేసిన ఫుడ్‌ఫై ఫీడ్‌బ్యాక్, రేటింగ్ ఇచ్చే అవకాశముంది. అయితే, ఫలానా ఫుడ్‌ను మన స్నేహితులకు రికమండ్ చేసే అవకాశం లేదు. ఈ లోటును తీర్చేందుకు జొమాటో తాజాగా 'రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్' ఫీచర్‌ను తీసుకొచ్చింది. వారం క్రితమే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చామని, లేటెస్ట్ వెర్షన్ యాప్‌లో ఇది అందుబాటులో ఉంటుందని జొమాటో యాజమాన్యం తాజాగా వెల్లడించింది. తాజా ఫీచర్‌తో ఫ్రెండ్స్ రికమండ్ చేసిన రెస్టరంట్‌లు, ఆహారపదార్థాలు మన జాబితాలో కనిపిస్తాయి. అందులో ఆసక్తి ఉన్నవాటిని బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. '' తాజా ఫీచర్.. మా కస్టమర్లు వారి స్నేహితుల ద్వారా సిఫారసు చేసిన ఆహారపదార్థాలను ఎంచుకునేందుకు వీలుకల్పిస్తుంది. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది'' అని జొమాటో ఫుడ్ డెలివరీ సీఈవో రాకేశ్ రంజన్ ఓ ప్రకటనలో తెలిపారు.
జొమాటోలో రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఫీచర్ !
الثلاثاء، 10 ديسمبر 2024
business science technology జొమాటోలో రికమండేషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఫీచర్ ఫుడ్‌ను మన స్నేహితులకు రికమండ్ చేసే అవకాశం
ليست هناك تعليقات:
إرسال تعليق