హైదరాబాద్ లోని నాంపల్లి ఏక్‌మినార్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఆయిల్ నింపేందుకు హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ వచ్చింది. ఈ క్రమంలో ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు, పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. అయితే, అటుగా వెళ్తోన్న గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి చాకచక్యంగా మంటలు పెట్రోల్ బంక్‌లో వ్యాపించకుండా ట్యాంకర్‌ను నిలువరించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలుగు అగ్నిమాపక శకటాలతో చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెట్రోల్ బంక్‌కు మంటలు వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదం సంభవించేదని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న తెలిపారు.
హైదరాబాద్ లో పెట్రోల్ ట్యాంకర్ నుంచి మంటలు !
الأربعاء، 11 ديسمبر 2024
Criem telangana నాంపల్లి ఏక్‌మినార్ కూడలి హిందూస్థాన్ పెట్రోలియం ట్యాంకర్ హైదరాబాద్ లో పెట్రోల్ ట్యాంకర్ నుంచి మంటలు
ليست هناك تعليقات:
إرسال تعليق