Ad Code

లావా యువ 2 ఆవిష్కరణ !


దేశీయ మార్కెట్లో లావా యువ 2 ను ఆవిష్కరించింది. ఇది మార్బుల్‌ ఫినిష్‌తో యువతకు ఆకట్టుకొనేలా వుంది. కేవలం ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.9,499 గా కంపెనీ నిర్ణయించింది. మార్బుల్‌ బ్లాక్‌, మార్బుల్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. లావా రిటైల్‌ స్టోర్ల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. లావా కొత్త ఫోన్‌.. 6.67 అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 700నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 90Hz రీఫ్రెష్‌ రేటుతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారంగా పనిచేస్తుంది. UNISOC T760 ప్రాసెసర్‌ అమర్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ సెన్సర్‌ ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందు వైపు 8ఎంపీ కెమెరా అమర్చారు. నోటిఫికేషన్‌ వస్తే కెమెరా చుట్టూ ఉన్న లైట్‌ బ్లింక్‌ అవుతుంది. 5000mAh బ్యాటరీ, 18W వైర్డ్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో తీసుకొచ్చారు. డ్యూయల్‌ సిమ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 3.5mm ఆడియో జాక్‌, బ్లూటూత్‌ 5.2, యూఎస్‌బీ టైప్‌- సి పోర్ట్‌ ఉన్నాయి. ఏడాదిలోపు ఫోన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేకుండా నేరుగా ఇంటికే వచ్చి సర్వీస్‌ను అందిస్తారు.

Post a Comment

0 Comments

Close Menu