కార్బన్-14 డైమండ్ బ్యాటరీ ?


బ్రిటీష్ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందం ఒక అద్భుతమైన బ్యాటరీని రూపొందించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి 'కార్బన్-14 డైమండ్ బ్యాటరీ'. ఇది వేల సంవత్సరాల పాటు తక్కువ మొత్తంలో శక్తిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బ్యాటరీ శక్తిని ఉత్పత్తి చేయడానికి డైమండ్‌లో నిక్షిప్తం చేసిన కార్బన్-14ని ఉపయోగిస్తుందని బ్రిస్టల్ యూనివర్సిటీ పేర్కొంది. కార్బన్-14 ఎలక్ట్రాన్‌లను విడుదల చేస్తుంది. అయితే ఇది విద్యుత్తును తయారు చేయడానికి ఫోటాన్‌లకు బదులుగా.. ఐసోటోప్ ద్వారా విడుదలయ్యే ఎలక్ట్రాన్‌లను ఉపయోగిస్తుంది. కార్బన్-14 జీవితకాలం 5,700 సంవత్సరాల కంటే ఎక్కువ. బహుశా ఇన్ని సంవత్సరాలు మనగలిగే బ్యాటరీ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఈ కార్బన్ 14 బ్యాటరీని అంతరిక్ష పరిశోధనలలోని ప్లానెటరీ రోవర్‌లకు శక్తినివ్వడానికి, నీటి అడుగున ఏర్పాటు చేసే సెన్సార్‌లలో, పేస్‌మేకర్‌లకు శక్తినివ్వడానికి, ఇంప్లాంట్ చేయదగిన వైద్య పరికరాలలో ఉపయోగించవచ్చు. అంటే ఎక్కువ రోజులు ఉపయోగించే పరికరాలలో ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు.


Post a Comment

0 Comments