ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయి మృతి చెందారు. జగదల్ పూర్, నారాయణపూర్, దంతెవాడ, కొండగావ్, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా బలగాలు పెద్దఎత్తున కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో వారికి మావోలు ఎదురపడ్డారు. దీంతో భద్రతా దళాలు, మావోలకు మధ్య గురువారం తెల్లవారుజామున భీకర యుద్ధం జరిగింది. ఎదురు కాల్పుల్లో సుమారు 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహించగా.. మావోలు తారసపడ్డారని, ఈ మేరకు జరిగిన ఎదురుకాల్పుల్లో వారు మృతిచెందినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యులు ఉండే అవకాశం ఉందని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.
భారీ ఎన్కౌంటర్ లో 12 మంది మావోయి మృతి !
الخميس، 12 ديسمبر 2024
chatishgadh national నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడి భారీ ఎన్కౌంటర్ లో 12 మంది మావోయి మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق