తెలంగాణలోని కాజీపేటలో కేంద్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్‌గ్రేడ్ చేయాలని గతేడాది జులై 5న దక్షిణ మధ్యరైల్వే జీఎంకి రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్‌గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ని అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబరు 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. కాజీపేట రైల్వో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు, కేంద్ర అధికారులతో హోం శాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడైంది.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ !
الخميس، 28 نوفمبر 2024
national telangana ఆదేశాలు జారీ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
ليست هناك تعليقات:
إرسال تعليق