అమెరికా కాలిఫోర్నియాలో లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ను అరెస్ట్ చేశారు. ఆయనపై పలు కేసులున్నాయి. 2022లో పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసుతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కేసులో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 12న ముంబైలో మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య కేసులో కూడా ఆయనకు సంబంధం ఉందని పోలీసులు ప్రకటించారు. కొంతకాలంగా ఆయన అమెరికాలో ఉంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయమై ముంబై పోలీసులు మరోసారి ఈ నెల మొదటివారంలో యుఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అంతకు ముందు ఆయన కెనడాలో ఉన్నారని ముంబై పోలీసులకు సమాచారం ఉంది. ఆయన కోసం రెడ్ కార్నర్ నోటీస్ ను ఇంటర్ పోల్ జారీ చేసింది.అన్మోల్ బిష్ణోయ్ పై రూ. 10 లక్షల రివార్డ్ ప్రకటించింది ప్రభుత్వం.
అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్ !
الاثنين، 18 نوفمبر 2024
Criem national అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్ అన్మోల్ బిష్ణోయ్ పై రూ. 10 లక్షల రివార్డ్ అమెరికా కాలిఫోర్నియాలో ఆయనపై పలు కేసులు రెడ్ కార్నర్ నోటీస్ ను ఇంటర్ పోల్ జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق