డిసెంబర్ 6న తమ డిమాండ్ల కోసం ఢిల్లీ మార్చ్ చేపట్టనున్నట్లు రైతు సంఘాలు సోమవారం ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) చట్టబద్ధమైన హామీతో పాటు వివిధ డిమాండ్లను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఢిల్లీ మార్చ్ చేపట్టనున్నట్లు రాజకీయేతర సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చాలు ప్రకటించాయి. ఢిల్లీ చలో మార్చ్ ను భద్రతా బలగాలు అడ్డుకోవడంతో… ఫిబ్రవరి 13 నుండి రైతులు పంజాబ్ హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దుల్లోనే నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాము ఢిల్లీ మార్చ్ చేపట్టాలని నిర్ణయించుకున్నామని మీడియానుద్దేశించి కెఎంఎం నేత సర్వన్ సింగ్ పంథేర్ పేర్కొన్నారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రైతులతో ఎటువంటి చర్చలు జరపడం లేదని సర్వన్ సింగ్ మండిపడ్డారు. గత తొమ్మిది నెలలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని శాంతియుతంగా వేచి చూశామని, కానీ ఇప్పుడు వేరే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. శంభు సరిహద్దు నుండి రైతులు దశల వారీగా ఢిల్లీ వైపు వెళతారని అన్నారు. తాము 280 రోజులుగా రెండు సరిహద్దుల్లోనే ఉన్నామని, ఫిబ్రవరి 18 నుండి కేంద్రం తమతో ఎలాంటి చర్చలు జరపలేదని భారతీయ కిసాన్ యూనియన్ (షహీద్ భగత్ సింగ్)కు చెందిన తేజ్వీర్ సింగ్ పేర్కొన్నారు. పంటలకు ఎంఎస్పి చట్టబద్ధమైన హామీతో పాటు రైతులకు రుణమాఫీ, రైతులు, రైతు కార్మికులకు పెన్షన్ అందించాలని, విద్యుత్ చార్జీల పెంపు ఉండకూడదని, 2021 లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసులో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, బాధితులకు న్యాయం జరగాలని, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణ, 2020-21 ఆందోళనలో మరణించిన రైతులకు, వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
డిసెంబర్ 6న రైతు సంఘాల ఢిల్లీ మార్చ్ !
الاثنين، 18 نوفمبر 2024
national కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రకటన డిసెంబర్ 6న రైతు సంఘాల ఢిల్లీ మార్చ్ రాజకీయేతర సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం)
ليست هناك تعليقات:
إرسال تعليق