తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీని ద్వారా వాహనదారులకు ఏడాదికి సుమారు రూ. లక్ష మిగులుతుందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ అమలులోకి వస్తుందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా చేయడం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన వివరాలను ఈ సందర్బంగా ఆయన వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అందులోభాగంగా రాష్ట్రంలో రవాణా శాఖ పరంగా మార్పులు, చేర్పులు తీసుకొచ్చి... ప్రజల్లో చైతన్య కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ మహానగరంలో కాలుష్య రహితంగా ఉంచేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు. గతంలో 2020 - 2030 ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) పాలసీ తీసుకొచ్చారని చెప్పారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఇది అమలులో ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అయితే సోమవారం నుంచి ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమలులోకి వస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి అనేది లేదని తెలిపారు. ఇక కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు సైతం తీసుకు వచ్చామన్నారు. హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత 83 ఉంటే పఠాన్‌చెరువులో 72 ఉందన్నారు. ఆ క్రమంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. త్వరలో నగరంలో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయని చెప్పారు. అయితే మరికొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు పరిమితి సంఖ్య లోనే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారన్నారు. ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్జప్తి చేశారు. వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ