హైదరాబాద్ నగరంలో ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా పడి పోయింది. దీంతో కూకట్‌పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇన్‌డెక్స్ 300 దాటి పోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతుంది. దీంతో పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేజారక ముందే చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. మరోవైపు నగరంలోని చిన్నారులు, వయో వృద్ధులతోపాటు శ్వాస కోశ వ్యాధుల సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ నగర వాతావరణం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని పర్యావరణ వేత్తలు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ మహా నగరానికి గతంలో నగర శివారుల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉండేవి. కానీ నేడు అవి నగరం మధ్యలోకి వచ్చేశాయి. అంటే నగరంలో అవి అంతర్భాగమయ్యాయి. అలాగే మహానగరం రోజు రోజుకు విస్తరిస్తుంది. ఇక నగరంలో ప్రధాన రహదారులు మాత్రమే కాదు.. చిన్న చిన్న దారుల్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో వాయి కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. ఇది ఒక్కటే కాదు.. హైదరాబాద్ మహానగరంలో వివిధ రకాల కాలుష్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఈ కాలుష్యాన్ని నియింత్రించే విషయంలో.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. గతంలో నగరంలో భారీ వృక్షాలు రహదారులకిరువైపులా ఉండేవి. నేడు నగరంలో ఆ పరిస్థితి అయితే లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.
హైదరాబాద్ నగరంలో వాతావరణంలో కీలక మార్పులు ?
الأحد، 24 نوفمبر 2024
telangana ఒక్కసారిగా పడి పోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది హైదరాబాద్ నగరంలో వాతావరణంలో కీలక మార్పులు ?
ليست هناك تعليقات:
إرسال تعليق