ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మంగళవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 32 అంశాలపై చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చామన్నారు. వర్గీకరణ సహా వివిధ అంశాలపై గంటపాటు చర్చించామన్నారు. ''కూటమి గెలుపులో మా భాగస్వామ్యం ఉందని గుర్తించాలి. తెదేపా, జనసేన, భాజపాతో కలిసి నాలుగో స్తంభంగా మేం పని చేశాం. మాదిగలకు అన్ని చోట్లా భాగస్వామ్యం కల్పించాలనేదే మా లక్ష్యం'' అని మందకృష్ణ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబును కోరిన మందకృష్ణ మాదిగ !
الثلاثاء، 5 نوفمبر 2024
Andhra Pradesh ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబును కోరిన మందకృష్ణ మాదిగ కూటమి గెలుపులో మా భాగస్వామ్యం ఉందని గుర్తించాలి
ليست هناك تعليقات:
إرسال تعليق