ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్, గాజాలో జరిపిన దాడుల వల్ల 40 మందికిపైగా మృతి చెందారు. గడచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల వల్ల లెబనాన్ లో 31 మంది మృతి చెందారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దళాలు ఉత్తర గాజాలో మూడుసార్లు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. భారీ వర్షలోనూ ఇజ్రాయెల్ సైన్యం దాడుల్ని ఆపలేదు. దీంతో పాలస్తీనియన్లు చెల్లాచెదురై టెంట్లలో తలదాచుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హెజ్బాల్లాతో 60 రోజుల కాల్పుల విరామ సంధిని ఆమోదించడానికి ఇజ్రాయెల్ కేబినెట్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
భారీ వర్షంలోనూ గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో : 40 మంది మృతి !
الثلاثاء، 26 نوفمبر 2024
40 మంది మృతి international గడచిన 24 గంటల్లో పాలస్తీనియన్లు చెల్లాచెదురై టెంట్లలో తలదాచుకున్నారు భారీ వర్షంలోనూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు
ليست هناك تعليقات:
إرسال تعليق