కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తామిచ్చిన ఆదేశాలను అమలు చేయని పక్షంలో కోర్టు ముందు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జలవనరులశాఖ ఈఈ డీవీ.రామ్‌గోపాల్‌పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ వారెంట్ అమలు చేసేందుకు వీలుగా విచారణను నవంబర్ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు.
కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్ లకు బెయిలబుల్ వారెంట్ !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق