త్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ సికింద్రాబాద్‌లో సిలిండర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధం రావడంతో ఆ ప్రాంత ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. శిథిలాల నుంచి ఐదు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

Post a Comment

أحدث أقدم