ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేల్ లో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మృతి చెందింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందన్న కోపంతో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ శనివారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం బాధితురాలిని కడప రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు విఘ్నేశ్ ను పోలీసులు గంటల వ్యవధిలో శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. కడప జిల్లా బద్వేలులో గోపవరం మండలంలోని సెంచరీ ప్లైవుడ్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి విఘ్నేశ్ అనే యువకుడు నిప్పంటించాడు. విద్యార్థినికి 80 శాతం కాలిన గాయాలు కాగా, తనకు సాయం చేయాలని ఆర్తనాదాలు చేసింది. అది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలికి చికిత్స అందించేందుకు శనివారం నాడు కడప రిమ్స్ కు తరలించారు. మరోవైపు ఘటనపై సీఎం చంద్రబాబాబు సీరియస్ అయ్యారు. నిందితుడ్ని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు విఘ్నేశ్ను అరెస్ట్ చేశారు. ప్రేమ వేధింపులే ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మృతి !
الأحد، 20 أكتوبر 2024
Andhra Pradesh Criem నిందితుడు విఘ్నేశ్ నుశనివారం రాత్రి అరెస్ట్ చేశారు పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మృతి పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందన్న కోపంతో
ليست هناك تعليقات:
إرسال تعليق