ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన విజయవాడ డ్రోన్‌ షో !


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కృష్ణా నది తీరంలో పున్నమి ఘాట్ వేదికగా జరిగిన డ్రోన్ షోలో 5,500 డ్రోన్లతో తొలిసారిగా దేశంలోనే అతిపెద్ద షోను నిర్వహించారు. డ్రోన్ షో కి ముందు జరిగిన లేజర్ షో లో, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్రోన్ షో కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కాగా ఈ  డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను (లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి, నదీ తీరాన లార్జెస్ట్‌ ల్యాండ్ మార్క్‌, అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి, అతిపెద్ద ఏరియల్‌ లోగో ఆకృతి, అతిపెద్ద విమానాకృతి) నెలకొల్పింది. ఈ సందర్భంగా గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు డ్రోన్ షో అనంతరం సీఎం చంద్రబాబు నాయుడికి గిన్నిస్‌ బుక్‌ రికార్డు ధృవపత్రాలు అందజేశారు. 

Post a Comment

0 Comments