దేశీయ మార్కెట్లో హెచ్‌పీ 2 ఇన్ 1 ఏఐ బేస్డ్ 'ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్' అనే కొత్త ల్యాప్‌టాప్ లాంచ్ చేసింది. ఇది ఇంటెల్ లూనార్ లేక ప్రాసెసర్ కోర్ అల్ట్రా సిరీస్ 2 పొందుతుంది. ఈ ప్రాసెసర్‌లు ఆన్-డివైస్ ఏఐ వర్క్‌లోడ్‌ల కోసం డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ని కలిగి ఉంటాయి. క్వాలిటీ వీడియోలను ఆస్వాదించడానికి అనుమతించే.. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 7 ప్రారంభ ధర రూ.1,81,999. ఇది ఎక్లిప్స్ గ్రే, అట్మాస్ఫియరిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది భారతదేశంలో కంపెనీ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో మాత్రమే కాకుండా.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా హెచ్‌పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 9 కూడా రూ.1,91,999 వద్ద అందుబాటులో ఉంది. ఇది అట్మాస్ఫియరిక్ బ్లూ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. హెచ్‌పీ లాంచ్ చేసిన ఈ కొత్త ల్యాప్‌టాప్‌లను అక్టోబర్ 31లోపల కొనుగోలు చేస్తే రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్, ప్రైమరీ ఎలిమెంట్స్ వంటి వాటిని ఉచితంగా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు బజాజ్ ఫైనాన్స్‌తో నో కాస్ట్ ఈఎమ్ఐ కింద కూడా కొనుగోలు చేయవచ్చు.14 ఇంచెస్ 2.8కే ఓఎల్ఈడీ డిస్‌ప్లే పొందుతుంది. మెరుగైన వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం హాప్టిక్ టచ్‌ప్యాడ్, 9 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 32 జీబీ ర్యామ్, 64 వాట్స్ బ్యాటరీ (21 గంటలు) పొందుతుంది. ఇది వైఫై, బ్లూటూత్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. డేటా రక్షణ, సైబర్ సెక్యూరిటీ వంటి వాటి కోసం ఫిజికల్ సెక్యూరిటీ చిప్ ఉన్నాయి. డీప్‌ఫేక్ డిటెక్టర్ కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ డేటాను రక్షించడానికి, ఇతరులు హ్యాక్ చేయకుండా ఉండటానికి ఉపయోగపడతాయి.
0 Comments