రతన్ టాటా గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత దేశంలో ఇండస్ట్రీయల్ అవార్డులను 'రతన్ టాటా' పేరుతో ఇవ్వాలని నిర్ణయించింది. పారిశ్రామిక రంగంలో కృషి చేసిన వారికి రతన్ టాటా ఉద్యోగ రత్న అవార్డు పేరుతో సత్కరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతే కాదు ఇకపై ముంబాయిలోని ఉద్యోగ భవన్ ని కూడా రతన్ టాటా ఉద్యోగ భవన్ గా మారుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే తొలి ఇండస్ట్రీయల్ అవార్డును 2023 లో మొదటిగా రతన్ టాటానే అందుకోవడం గమనార్హం. ఆయన అందుకున్న తొలి అవార్డును ఆయన పేరుతో ఇవ్వడం ఆయనకు ఇచ్చే గొప్ప నివాళి అని ప్రభుత్వం అంటుంది. నిన్న మహారాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర కేబినెట్ రతన్ టాటాకు సంతాపం ప్రకటించి, అనంతరం, దేశానికి ఆయన చేసిన సేవలకు గాను అత్యుత్తమ పురస్కారం 'భారత రత్న' ఇవ్వాలని మంత్రి వర్గం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.
ఇండస్ట్రియల్ అవార్డులను 'రతన్ టాటా' పేరుతో ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం !
الجمعة، 11 أكتوبر 2024
business national ఇండస్ట్రియల్ అవార్డులను 'రతన్ టాటా' పేరుతో ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పారిశ్రామిక రంగంలో కృషి చేసిన వారికి రతన్ టాటా ఉద్యోగ రత్న అవార్డు
ليست هناك تعليقات:
إرسال تعليق