రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ !


తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ  ఎలాంటి ఆలోచన లేకుండా సీఎం మాట్లాడుతున్నారని, మూసీకి ఆయన ఇచ్చిన నిర్వచనాలు విని జనం నవ్వుతున్నారన్నారు. మూసి బాధితుల దగ్గరకు, మల్లన్న సాగర్ కు పోదాం రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. గన్ మెన్ లు లేకుండా పోదాం అని సీఎం అన్నారు. నేను కారు నడుపుకుంటూ వస్తాను.  నా పక్కన కూర్చో ఇద్దరం కలిసి వెళ్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు.   నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్బుత విన్యాసం చూశామని, ఇచ్చిన హామీలు దృష్టి మరల్చే విధంగా చేస్తున్నారని ఆగ్రహించారు. హైదరాబాద్ కు మూడు దిక్కులా సముద్రం ఉంది అని సీఎం అంటున్నారని, హైదరాబాద్ లో మాత్రమే నగరం మధ్యలో నుంచి నది వెళుతోంది అన్నారని చురకలు అంటించారు. చాలా నగరాల మధ్యలో నది వెళ్తుందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం గా ఉండి ఒక్క సీటు గెలవలేదు అన్నారని, కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం గా ఒక్క సీటు కూడా గెలవలేదన్నది  గుర్తుంచుకోవాలన్నారు. గ్రాఫిక్ హంగులతో సిఎం రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ను నిన్న ప్రెస్ మీట్ లో చూపించారని ఆగ్రహించారు. 

Post a Comment

0 Comments