జియో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా అదనంగా 20GB డేటాను అందిస్తోంది. జియో రూ.899 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 180GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు అదనంగా 20GB డేటాను అందిస్తోంది. మొత్తంగా 200GB డేటాను పొందవచ్చు. వీటితోపాటు జియో సినిమా, జియో క్లౌడ్, జియోటీవీ యాప్‌లను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు. ప్రతినెల రీఛార్జ్ చేసుకొనే విషయంలో విసుగుచెందేవారు ఈ తరహా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇదే తరహాలో ఎక్కువ వ్యాలిడిటీని అందించే రీఛార్జ్ ప్లాన్‌లు మరిన్ని ఉన్నాయి. జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.999 ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మరియు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 98 రోజులుగా ఉంది. జియో సినిమా, జియోటీవీ, జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు. జియో రూ.749 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లు మరియు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అదనంగా 20GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంది. ఈ ప్రయోజనాలతోపాటు జియోటీవీ, జియోక్లౌడ్, జియోసినిమా యాప్‌లను వినియోగించుకోవచ్చు. భారత్‌లో 98 శాతం జిల్లాలకు జియో తన 5G సేవలను విస్తరించింది. అయితే ట్రాయ్ కీలక విషయాన్ని వెల్లడించింది. టెలికాం మార్కెట్‌లో జియో తన ఎదుగుదలను కొనసాగిస్తోందని పేర్కొంది. దీంతోపాటు జియో 5G యూజర్లు క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. 130 మిలియన్‌లుగా ఉన్న యూజర్లు ప్రస్తుతం 147 మిలియన్‌లకు పెరిగినట్లు తెలిపింది.
0 Comments