ముఖేష్ అంబానీ కంపెనీ జియో స్మార్ట్ షాపింగ్ కార్ట్‌ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో విడుదల చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించారు. ఇందులో కెమెరాలు కూడా అమర్చారు. వాటి సహాయంతో, కస్టమర్ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. బిల్లింగ్ కోసం కౌంటర్‌కి వెళ్లాల్సిన పనిలేదు. వినియోగదారుడు ఈ తోపుడు బండ్లలో వస్తువులను ఉంచేటప్పుడు దానికే అమర్చిన కెమెరా ముందు వస్తువులపై బార్ కోడ్‌ను చూపాలి. అంటే దానిని స్కాన్ చేయాల్సి ఉంటుంది. కౌంటర్ దగ్గర నిలబడిన వ్యక్తి ఏదో స్కాన్ చేస్తున్నట్లే.. స్కాన్ చేసిన తర్వాత ఆ ఉత్పత్తి ఆన్‌లైన్ కార్ట్‌కి జోడించబడుతుంది. తర్వాత ఆ బండిలో వేసుకోవచ్చు. మీకు ఏ వస్తువులు కావాలో వాటిని స్కాన్ చేసి బండిలో వేసుకోవాలి. ఏదైనా వస్తువును తొలగించాల్సి వస్తే దానిని కూడా అదే విధంగా మళ్లీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న ఏఐ కార్ట్‌లో ఏ వస్తువులు ఉన్నావి.. లేనివి కనుగొనగలుగుతాయి. షాపింగ్ పూర్తయిన తర్వాత పూర్తి బిల్లు ఈ కార్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయచ్చు. దీంతో చాలా సమయం ఆదా అవుతుంది. ఇలాంటి తోపుడు బండిని ప్రస్తుతం పరిమిత నగరాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం హైదరాబాద్, ముంబైలోని పలు స్టోర్లలో దీనిని ఉపయోగిస్తున్నారు. త్వరలో దేశంలోని ఇతర స్టోర్లకు కూడా తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.
జియో స్మార్ట్ షాపింగ్ కార్ట్ విడుదల !
الجمعة، 18 أكتوبر 2024
business national science technology ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించారు జియో స్మార్ట్ షాపింగ్ కార్ట్ విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق