పోలీసుల మాదిరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కానీ, ఫైనాన్షియల్ మార్కెట్‌పై మాత్రం గట్టి నిఘా ఉంచడంతోపాటు అవసరమైనప్పుడు నియంత్రణ చర్యలు తీసుకుంటుందన్నారు. నవీ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ సహా నాలుగు సంస్థలు రుణాలు మంజూరు చేయకుండా ఆంక్షలు విధించిన మరుసటి రోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్‌కు చెందిన నవీ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌తో సహా నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అక్టోబర్ 21 నుంచి కొత్త రుణాలను మంజూరు, పంపిణీ చేయొద్దని ఆదేశించింది. వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ ఎక్కువగా ఉండటం, వడ్డీరేట్లు పరిమితికి మించి అధికంగా వసూలు చేస్తున్నాయని గమనించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
పోలీసుల మాదిరిగా ఆర్బీఐ వ్యవహరించలేదు !
الجمعة، 18 أكتوبر 2024
business national ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పోలీసుల మాదిరిగా ఆర్బీఐ వ్యవహరించలేదు ఫైనాన్షియల్ మార్కెట్‌పై మాత్రం గట్టి నిఘా
ليست هناك تعليقات:
إرسال تعليق