పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. అత్యవసర సమావేశానికి రావాలని అరబ్ దేశాలను రష్యా ఆహ్వానించింది. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల దాడి చేయడాన్ని అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రష్యా కీలక సమావేశానికి పూనుకుంది. ఈ సమావేశంలో అరబ్ దేశాలతో రష్యా చర్చిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసేందుకు రెడీ అవుతోంది. ఇరాన్‌కు చెందిన చమురు, అణు కేంద్రాలు లక్ష్యంగా దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక ఐడీఎఫ్ అయితే.. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేసేందుకు ప్రణాళిక వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇరాన్‌పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అరబ్ దేశాలతో రష్యా అత్యవసర భేటీ ?
الأربعاء، 2 أكتوبر 2024
international అరబ్ దేశాలతో రష్యా అత్యవసర భేటీ ? ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసేందుకు రెడీ అవుతోంది పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో
ليست هناك تعليقات:
إرسال تعليق