వాట్సాప్‌లో సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్స్ తమకు చాట్ లో వచ్చిన ఇమేజెస్ ను గూగుల్ లో వెళ్లి సెర్చ్ చేయవచ్చట. ప్రస్తుతం ఫేక్ ఫొటోలు వైరల్ అవుతున్న తరుణంలో వాటికి చెక్ పెట్టడం కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. మీకు వచ్చిన ఫొటో నిజమైందేనా? లేక ఎడిట్ చేసిందా? అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సదరు ఫొటో సోర్స్ కూడా ఏంటో చెప్పవచ్చు. ఈ ఫీచర్ వల్ల తమ యూజర్ల గోప్యతకు ఎలాంటి ముప్పు ఉండదని వాట్సాప్ చెబుతోంది. ప్రస్తుతం డెవలపింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే టెస్టింగ్‌కు తీసుకొచ్చి యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ యూజర్లకు మరింత ఊరట లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇటీవల కాలంలో వాట్సాప్ లో వస్తున్న ఫేక్ ఫోటోలకు చెక్ పెట్టినట్టు అవుతుంది.
వాట్సాప్‌లో సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్ ఫీచర్ !
الأحد، 13 أكتوبر 2024
science technology WhatsApp వచ్చిన ఫొటో నిజమైందేనా? లేక ఎడిట్ చేసిందా? అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు వాట్సాప్‌లో సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్ ఫీచర్
ليست هناك تعليقات:
إرسال تعليق