ఆంధ్రప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన క్రీడా సంఘాలతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) భేటీ నిర్వహించారు. క్రీడా విధానం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. క్రీడారంగాన్ని నవీకరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు మొదలయ్యాయని మంత్రి వెల్లడించారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా శాప్ యాప్ ప్రారంభిస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో క్రీడా సంఘాలతో చాలాకాలం తర్వాత సమావేశం ఏర్పాటు చేశామని శాప్ ఛైర్మన్ రవినాయుడు తెలిపారు. శాప్ ఎండీ గిరీష్, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అందుబాటులోకి రానున్న శాప్ యాప్ !
الخميس، 10 أكتوبر 2024
sports ఆంధ్రప్రదేశ్ అందుబాటులోకి రానున్న శాప్ యాప్ క్రీడా విధానం క్రీడా సంఘాలతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ భేటీ క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ليست هناك تعليقات:
إرسال تعليق