సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సవాల్ !


హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి, వినాయక నగర్ డివిజన్ లో హైడ్రా బాధితులతో ఈటెల రాజేందర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల బతుకుల్లో రేవంత్ సర్కారు మట్టి కొడుతుందని మండిపడ్డారు. “రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే మీరు, నేను ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ల దగ్గరికి వెళ్దాం. డేట్ మీరే డిసైడ్ చేయండి. చైతన్యపురి లాంటి కాలనీలకు పోదామా ? అక్కడి ప్రజలు శభాష్ రేవంత్ రెడ్డి అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తాను” అంటూ ఈటెల సవాల్ చేశారు. ఓవైపు పేదల ఇళ్లను కూల్చం, నిశ్చింతగా ఉండండి అని రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతూ మరోవైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పేరుతో మార్కింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. శని, ఆదివారాలు వస్తే ఎక్కడ బుల్డోజర్లు వస్తాయోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతకడానికి కారణం రేవంత్ రెడ్డి నువ్వు కాదా..? అని ప్రశ్నించారు. ప్రజల కళ్లల్లో నీళ్లు చూసి సంతోషపడేవాడు మనిషి కాదు, శాడిస్ట్ అవుతారని దుయ్యబట్టారు.

Post a Comment

0 Comments